తిరుమలగిరి(సాగర్) : ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న భూవివాదాలను పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా, డివిజన్ ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించి, ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. భూముల యజమానులు, సరిహద్దులు, గెజిట్ నోటిఫికేషన్లు, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని పలు విభాగాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా ఫారెప్ట్ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ అనిల్ ఉన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


