నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం సోమవారం జనసంద్రాన్ని తలపించింది. అమవాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమవాస్య రాత్రి దేవాలయంలో వేద మంత్రలతో లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సతీష్‌శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్‌శర్మ ఆధ్వర్యంలో పూజలు సాగాయి. ఈఓ మోహన్‌బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. గట్టు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఎస్‌ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు.


