విద్యార్థులకు శుభాకాంక్షలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు శుభాకాంక్షలు : ఎస్పీ

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

న్యూస్‌రీల్‌

మంత్రి ప్రకటన నెరవేరేనా..

నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు ఉత్సాహం, క్రమశిక్షణ, బాధ్యతతో ప్రారంభించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చదువు, వ్యాయామం, వినోదం, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కష్టపడి చదవాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, 100/112 అత్యవసర స్పందన సేవ, 1930 సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌, 8712670266 నల్లగొండ జిల్లా మాదకద్రవ్యాల నిర్మూలన హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

యాదగిరి క్షేత్రంలో

సుదర్శన హోమం

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆలయ అర్చకులు ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు.

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026

మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మిర్యాలగూడ పట్టణ పరిధిలోని అద్దంకి– నార్కట్‌పల్లి బైపాస్‌పై మూడు ఫ్లైఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రెండేండ్ల కిందట రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, రెండేండ్ల క్రితం శంకుస్థాపన చేసిన గుంతను సైతం పూడ్చివేశారు. ఈ రెండళ్ల కాలంలో సుమారు 25 రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. అయినా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్లైఓవర్ల నిర్మాణానికి రూ.180 కోట్లు

మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి– అద్దంకి బైపాస్‌రోడ్డు గల వై జంక్షన్‌, నందిపాడు క్రాస్‌రోడ్డు, చింతపల్లి క్రాస్‌రోడ్డు, ఈదులగూడ క్రాస్‌రోడ్డు నాలుగు చోట్ల రూ.180 కోట్లతో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలుత చెప్పారు. అందులో రూ.30 కోట్లు భూములు కోల్పోయిన వారికి కేటాయించారు. ఆ నిధులతో మూడు ఫ్లైఓవర్లకే సరిపోతాయని వై జంక్షన్‌, నందిపాడు క్రాస్‌రోడ్డు, చింతపల్లి క్రాస్‌రోడ్డులో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు.

రెండేళ్లలో ప్రమాదాలు కొన్ని..

● పట్టణంలోని నందిపాడు బైపాస్‌రోడ్డు వద్ద పెట్నకోట భరతయ్య(75) స్కూటీపై పట్టణంలోకి వస్తున్న క్రమంలో హైదరాబాద్‌ వైపుకువెళుతున్న కంటైనర్‌ అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. స్కూటీని ఢీ కొట్టిన అనంతరం అదే స్పీడ్‌తో రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో రెండు డీసీఎం వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదలో భరతయ్య అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

● పట్టణంలోని కృష్ణా కాలనీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడుకు చెందిన దేవులపల్లి నాగభూషణం పద్మ దంపతుల కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ప్రయాణిస్తున్న షిఫ్ట్‌ కారు ప్రమాదానికి గురైంది. వీరంతా విజయవాడ పెనుగంచిప్రోలు, మోపిదేవి, కోటప్పకొండ ఆలయాల్లో పూజలు ముగించుకోని కారులో మిర్యాలగూడకు తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణ పరిధిలోని కృష్ణకాలనీ సమీపంలోకి రాగానే లారీ అతివేగంగా రావడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు పడింది. అదే సమయంలో అటు నుంచి వస్తున్న బొగ్గు లారీ కారును బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

● చింతపల్లి బైపాస్‌రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. ఇటీవల కారు బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఇలా మిర్యాలగూడ బైపాస్‌లో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ పరిధిలో మూడు ఫ్లైఓవర్‌ బ్రిడ్జిల పనులను నామ్‌ ఎక్స్‌ప్రెస్‌కు అప్పగించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కానీ, రెండేండ్ల కిందట శంకుస్థాపన చేసి.. ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ప్రారంభించలేదని, ఈసారైనా మంత్రి, ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement