రామగిరి (నల్లగొండ) : తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని, గ్రామీణ సంస్కృతిని మేరెడ్డి యాదగిరిరెడ్డి అత్యంత సమగ్రంగా ఆవిష్కరించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కొనియాడారు. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, సృజన సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి సాహిత్య సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా మేరెడ్డి యాదగిరిరెడ్డి ఎంతో నిబద్ధతతో సాహిత్య సృజన చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, తండు కృష్ణకౌండిన్య, రచయిత శిరంశెట్టి కాంతారావు, గుడిపాటి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, అలుగుబెల్లి రామచంద్రరెడ్డి, భూతం ముత్యాలు, వల్లాల అచ్చయ్య పరందాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, పున్న అంజయ్య, బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్‌రావు, ఓరుగంటి పురుషోత్తం, కుకుడాల గోవర్దన్, డాక్టర్ మొహమ్మద్ హసేన, మల్లికార్జునచారి, నాగేందర్, సత్తయ్య, జానకిరామ్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మహేందర్, చెరుపల్లి సంధ్య, తరుణోజు భీష్మాచార్య, శ్రీకళా రామ్మూర్తి పాల్గొన్నారు.


