అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి కసరత్తు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి కసరత్తు

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

మిర్యాలగూడ టౌన్‌ : అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పొస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలో 163 అంగన్‌వాడీ టీచర్‌, 756 హెల్పర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. పోస్టులు భర్తీ అధికారులు శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. కొంతమంది నోటిఫికేషన్‌కు ముందే రాజకీయ పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మొత్తం 2093 కేంద్రాలు..

జిల్లాలోని అనుముల, చింతపల్లి, దామరచర్ల, కొండమల్లేపల్లి, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నకిరేకల్‌, నల్లగొండ తొమ్మిది ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 2093 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 65 ఏళ్లు నిండిన టీచర్లు, హెల్పర్లకు పదవివీరమణ కల్పించారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య, లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అంగన్‌వాడీ భర్తీ ప్రక్రియ ఇలా..

గతంలో 10వ తరగతి చదివిన వారికి అంగన్‌వాడీ పోస్టులను ఇచ్చారు. ఇప్పుడు విద్యా అర్హత ఇంటర్మీడియేట్‌కు పెంచారు. కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేయనున్నారు. ఈ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ఆర్డీఓ, డీడబ్ల్యూఓ, డీఎంహెచ్‌ఓలు కమిటీ సభ్యులుగా ఉంటారు. పోస్టుల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తం 100 మార్కుల ప్రక్రియతో భర్తీ చేస్తారు. ఇందులో ఇంటర్మీడియేట్‌లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా 70 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేనివారికి 10 మార్కులను అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులను కలిపి మెరిట్‌ వచ్చిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు.

ఫ 163 టీచర్‌, 756 హెల్పర్‌ పోస్టులు ఖాళీ

ఫ జిల్లాస్థాయి కమిటీ చేత ఎంపిక

ఖాళీల వివరాలు ఇలా..

ప్రాజెక్టులు టీచర్‌ హెల్పర్‌

అనుముల 18 82

చింతపల్లి 23 75

దామరచర్ల 20 105

దేవరకొండ 35 110

కొండమల్లేపల్లి 22 66

మిర్యాలగూడ 17 68

మునుగోడు 09 69

నకిరేకల్‌ 10 89

నల్లగొండ 09 92

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement