రెండేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తాం

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

మంత్రి కోమటిరెడ్డి

వెంకట్‌రెడ్డి

కనగల్‌ వద ్దసీఎం

సభ ఏర్పాట్ల పరిశీలన

కనగల్‌ : హ్యాం రోడ్ల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కనగల్‌ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి హాజరుకానున్న బహిరంగ సభ స్థలాన్ని, హ్యాం రోడ్ల పైలాన్‌, హెలిపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 14 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తగా హ్యాం పద్ధతిలో నిర్మించే రోడ్లకు 17వ తేదీ సీఎం రేవంత్‌రెడ్డి కనగల్‌ వద్ద శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రోడ్లు ఉంటేనే పరిశ్రమలు, సంక్షేమం ఉంటాయన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూడా 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. కేంద్ర సీఆర్‌ఎఫ్‌ నిధుల ద్వారా నల్లగొండ నుంచి దర్వేశిపురం వరకు స్ట్రెయిట్‌ రోడ్‌ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే మంజూరైందని, దాని పక్కనే బుల్లెట్‌ ట్రైన్‌ డీపీఆర్‌ కూడా సద్ధమవుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని తెలిపారు. సభకు అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఇంచార్జ్‌ అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ రమేష్‌, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ శంకర్‌నాయక్‌, డీఎస్‌పీ కె శివరాంరెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ గణేష్‌, తహసీల్దార్‌ పద్మ, ఎంపీడీఓ వేదరక్షిత, ఎల్లమ్మ ఆలయ చైర్మన్‌ చీదేటి వెంకట్‌రెడ్డి, నాయకులు గడ్డం అనూప్‌రెడ్డి, నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కూసుకుంట్ల రాజిరెడ్డి, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, నర్సింగ్‌ మురళిగౌడ్‌, గోలి జగాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, నర్సింగ్‌ కృష్ణయ్యగౌడ్‌, ఎండీ.హపీజోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement