నల్లగొండ టూటౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, జిల్లా ప్రజలకు క్షమాపన చెప్పిన తరువాతనే జిల్లాకు రావాలని, లేకుంటే సీఎం రేవంత్‌రెడ్డి సభను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కుంభకోణాల అడ్డగా మారిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన స్వలాభం కోసం నల్లగొండ బైపాస్ రోడ్డు అలాట్‌మెంట్ మార్చారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కుంభకోణం జరిగినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నల్లగొండలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని, సర్ అంటేనే కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. నల్లగొండలో రోహింగ్యాలు కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ల వైర్లు చోరీ చేసినట్లు డీఎస్పీ చెప్పారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు వీరెళ్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, పకీరు మోహన్‌రెడ్డి, శాంతస్వరూప్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి


