దేవరకొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పార్టీ బీఎల్‌ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) కంకణబద్ధులై పని చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, శాసనమండలి విప్ బల్మూరి వెంకట్ అన్నారు. మంగళవారం దేవరకొండలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఓటరు సవరణ కార్యక్రమాన్ని తమ రాజకీయ విస్తరణకు ఉపయోగించుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ట్రైనర్ ప్రతాప్‌రెడ్డి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక, ఎంఏ సిరాజ్‌ఖాన్, వేణుధర్‌రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, వడ్త్యా దేవేందర్, నాయిని మాధవరెడ్డి, ముక్కమళ్ల వెంకటయ్య పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలునాయక్


