
నేడు బీసీ సంఘాల బంద్
నల్లగొండ టౌన్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు శనివారం బంద్ నిర్వహించనున్నారు. బంద్‌కు ఆయా పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బంద్‌లో భాగంగా రవాణా వ్యవస్థ, విద్యా సంస్థలతో పాటు ఇతర వ్యాపార సంస్థలను బంద్ చేయాలని కోరారు. ఈ బంద్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, ఇతర వామపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు పాల్గొననున్నాయి. బంద్ విజయవంతానికి ఇప్పటికే బీసీ సంఘాల జేఏసీ నాయకులు సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రచారం చేశారు.
ఫ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు