
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తిప్పర్తి : తిప్పర్తి మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెం, అంతయ్యగూడెం, మామిడాల గ్రామాల్లో ధాన్యం కొనగోలు కేంద్రాలను ప్రారంభించారు. కంకణాలపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తిప్పర్తి కొనుగోలు కేంద్రంలో మిల్లులకు ధాన్యం తరలించే లారీలను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని మామిడాల గ్రామ ఉన్నత పాఠశాల అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం రూ.లక్ష ఆర్థికసాయాన్ని పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ం నూనె విష్ణుకు అందజేశారు. పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్, డీఎం గోపికృష్ణ, డీసీఓ పాత్యానాయక్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకురి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఎ సుధాకర్, ఏపీఎం హరి తదితరులు పాల్గొన్నారు.