
‘మద్యం’ టెండర్లకు నేడు ఆఖరు
కౌంటర్లు పెంచుతాం
నల్లగొండ : మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఊపందుకున్నాయి. దరఖాస్తుల గడువు శనివారం ఒక్కరోజే ఉంది. దీంతో శుక్రవారం ఒక్కరోజే 1,387 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 8 గంటల వరకు కూడా లైన్‌లో ఉండి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు మొత్తం 2439 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు.
జిల్లాలో 154 మద్యం దుకాణాలు
మద్యం దుకాణాల కేటాయింపునకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణపై ప్రారంమైంది. 154 దుకాణాలకు నల్లగొండలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొన్నటి వరకు మంచి రోజుల కోసం ఎదురు చూసిన దరఖాస్తుదారులు గురు, శుక్రవారాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. గురువారం 556, శుక్రవారం 1387 వరకు దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. అప్పటి వరకు దరఖాస్తులు వేసేందుకు ఎంత మంది వచ్చినా అందరినీ లైన్‌లో ఉంచి రాత్రి అయినా వారి వద్ద దరఖాస్తులు తీసుకుంటారు. ఆఖరు రోజు అయినందున దరఖాస్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఫ శుక్రవారం ఒక్కరోజే 1,387 దరఖాస్తులు
మద్యం టెండర్లకు శనివారం ఆఖరి రోజు అయినందున దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా కౌంటర్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు 14 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నాం. మరో కౌంటర్లు పెంచుతాం. అయిదు గంటల్లోపు దరఖాస్తులతో వచ్చిన వారి నుంచి.. ఎంత రాత్రి అయినా దరఖాస్తులు తీసుకుంటాం.
– సంతోష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్