
మహిళలు పోరాడే చైతన్యాన్ని పెంచుకోవాలి
నల్లగొండ టౌన్ : మహిళలు పోరాడే చైతన్యం పెంచుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ నేత వి.సంధ్య అన్నారు. పీఏడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం నల్లగొండలోని బాలికల జూనియర్ కళాశాలలో ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సామాజిక అభివృద్ధికి మహిళలు ఐక్యంగా ఉద్యమించడం ఎంతో అవసరమన్నారు. మహిళా హక్కుల సాధనలో భాగంగా సమస్యలను వెలికితీసి పోరాటం చేయడంలో ప్రగతిశీల మహిళా సంఘం అందరికన్నా ముందు వరుసలో ఉందన్నారు. ఈ సందర్భంగా ‘పని విధానం ప్రణాళిక కార్యక్రమం’ అనే అంశాన్ని జాతీయ నాయకురాలు జి.ఝాన్సీ బోధించారు. అంతకు ముందు పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.అనసూయ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అందె మంగ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, హరిత, కే.జ్యోతి, సీత, పద్మ, ఆదిలక్ష్మి, కే.జ్యోతి, పి.ఉపేంద్ర, లక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు.