
నందీశ్వరుడికి పంచామృతాభిషేకం
మేళ్లచెరువు : మండల కేంద్రంలో శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో శనివారం బహుళ త్రయోదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి పూజ, పూణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన, మహానివేదన, మంగళనిరాజనం అనంతరం తీర్థప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం ప్రదోష సమయంలో నందీశ్వరుడికి పంచామృతాభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఎన్.శంభిరెడ్డి, ఆలయ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయశర్మ, సిబ్బంది కొండారెడ్డి, నర్సింహరెడ్డి భక్తులు పాల్గొన్నారు.