మూడు ప్రభుత్వ ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

Sep 29 2025 8:45 AM | Updated on Sep 29 2025 8:47 AM

కష్టపడ్డారు.. ఫలితం దక్కింది

మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామానికి చెందిన మోర్తాల రాంనర్సిరెడ్డి గ్రూప్‌–2 ఫలితాల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. రాంనర్సిరెడ్డి చిన్నతనంలోనే అతడి తండ్రి శేఖర్‌రెడ్డి మృతిచెందగా.. పట్టుదలతో చదివి గ్రూప్‌–2, 3 ఉద్యోగాలు సాధించారు. అంతేకాకుండా హైకోర్టు అసిస్టెంట్‌ ఫలితాల్లో కూడా మెరిట్‌ పొంది ఇటీవల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకున్నారు. ఒకేసారి మూడు ఉద్యోగాలు పొందిన రాంనర్సిరెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

ఏఎస్‌ఓగా పంచాయతీ కార్యదర్శి..

చివ్వెంల : మండల

పరిధిలోని రాజుతండా గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అంగోతు నరేష్‌ ఆదివారం ప్రకటించిన గ్రూప్‌–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 717 ర్యాంకు సాధించి ఏఎస్‌ఓగా ఎంపికయ్యాడు. చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ ఆవాసం అంగోతు తండాకు చెందిన నరేష్‌ 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్‌–2లో ఉత్తీర్ణత సాధించి ఏఎస్‌ఓగా ఎంపిక కావడం పట్ల తండావాసులు, సహ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఎస్టీ విభాగంలో రాష్ట్రస్థాయి 16వ ర్యాంకు సాధించినట్లు నరేష్‌ తెలిపాడు.

నల్లగొండ టూటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్‌–2 ఫలితాల్లో శాలిగౌరారం మండలంలోని మా దారం కలాన్‌ గ్రామానికి చెందిన కె.హరిప్రీత్‌ రెడ్డి కోపరేటివ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం సాధించాడు. గతంలో ఆయన గ్రూప్‌–4 ఉద్యోగం సాధించి చిట్యాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్‌–2 రాసిన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం పట్ల ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) ఆదివారం విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగాలు సాధించారు. కొందరు ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా గ్రూప్స్‌కు సన్నద్ధమవుతూ విజయం సాధించగా.. మరికొందరు ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గ్రూప్‌–2

ఉద్యోగాలు సాధించారు.

జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి ఎంపీఓగా..

కార్యదర్శి నుంచి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా..

భూదాన్‌పోచంపల్లి : గ్రూప్‌–2 ఫలితాలలో భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కంచర్ల రాజశేఖర్‌రెడ్డి సచివాలయం సాధారణ పరిపాలన అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి మండలంలోని జలాల్‌పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరాడు. రాజశేఖర్‌రెడ్డిది స్వస్థలం చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామం. తండ్రి లారీ డ్రైవర్‌ కాగా, తల్లి గృహిణి. స్థానికంగా జెడ్పీ హైస్కూల్‌ ఎస్సెస్సీ, చౌటుప్పల్‌లో ఇంటర్‌, నేతాజీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. గ్రూప్‌ –2 ఫలితాలలో అసిస్టెంట్‌ సెక్షన్‌ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించడం పట్ల ఎంపీడీఓ భాస్కర్‌, ఎంపీఓ మాజిద్‌, సూపరిండెంట్‌ సత్యనారాయణ, తల్లిదండ్రులు, తోటి పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

మిర్యాలగూడ టౌన్‌ : మిర్యాలగూడ మండలం మైనవారిగూడెం గ్రామానికి చెందిన మైనం సుధాకర్‌, నాగమణి దంపతుల కుమారుడు మైనం అశోక్‌ ఆదివారం వెలువడిన గ్రూప్‌–2 ఫలితాల్లో మండల పంచాయతీ ఆఫీసర్‌(ఎంపీఓ)గా ఎంపికయ్యారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన అశోక్‌ గతంలో గ్రూప్‌–4కు ఎంపికై ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్‌–3లో కూడా ఉద్యోగం సాఽధించారు. ఇంకా ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని అశోక్‌ తెలిపారు. ఆయను తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా హరిప్రీత్‌రెడ్డి

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు1
1/4

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు2
2/4

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు3
3/4

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు4
4/4

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement