
రేషన్ డీలర్లకు కమీషన్ ఇప్పించాలి
నల్లగొండ: ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ కమీషన్‌ను వెంటనే ఇప్పించాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి తమకు రావాల్సిన కమీషన్ ప్రభుత్వం నుంచి ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు నాగరాజు పులిచింతల సత్తిరెడ్డి, పగిళ్ల వెంకటేశ్వర్లు, బొల్లా వేణుగోపాలరావు, సముద్రాల యాదయ్య గౌడ్, జనార్దన్, వివిధ ప్రాంతాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.