
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నల్లగొండ: పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పోలీసులను ఆదేశించారు. నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో 25మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేవించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.