
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
నల్లగొండ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేసే సీపీఎం శ్రేణులను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని తక్షణమే వాటిని సవరించాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి అయిలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.