
రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని తెలంగాణ జెన్‌కో ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదన సంవత్సర లక్ష్యాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసినట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్(సీఈ) మంగేష్‌నాయక్ తెలిపారు. మంగళవారం విద్యుదుత్పాదన ప్రధాన కేంద్రం పవర్ కంట్రోల్ రూమ్‌లో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యుదుత్పాదన కేంద్రం మెయిన్ పవర్‌హౌస్ 2025–26 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు కాగా.. మంగళవారం నాటికి(సెప్టెంబర్ 30) లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా.. 540 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 1,922 మిలియన్ యూనిట్లు ఉత్పాదన చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడంపై ఇంజినీర్లను ప్రశంసించారు.
ఫ ఏడాది టార్గెట్ ఆరు నెలల్లోనే పూర్తి