
జిల్లా స్థాయి సాహితీ పోటీలు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకు చెందిన సాహితీవేత్త గ్రంథాలయ ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి సందర్భంగా జిల్లా స్థాయి సాహితీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి ఎండీ.హసేనా తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన అంశాలపై వ్యాస రచన, కవితలు, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 20వ తేదీలోపు తమ వ్యాసాలు, కవితలు, పాటలను telanganasahithinlg 2024 @gmail.comకు మెయిల్ పంపించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9848228004 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.
బుద్ధవనాన్ని సందర్శించిన అమ్రాబాద్ సీసీఎఫ్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని మంగళవారం అమ్రాబాద్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్(సీసీఎఫ్) సునీల్ హిరామత్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూప వనం, మహాస్థూపం అంతర్భాగంలోని ధాన్య మందిరాన్ని సందర్శించి ధ్యానం చేశారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రు బుద్ధవనం బ్రోచర్లను అందజేశారు. అనంతరం వీరు సాగర్ జలాశయంలో లాంచీలో విహరించారు. వీరితో పాటు ఒడిశాకు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన మరో అధికారి విశ్వనాథ్ నీల్ అన్వార్ కూడా ఉన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను, సాగర్ వివరాలను వివరించారు. వారి వెంట ఎఫ్‌డీఓ సంగీత, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రమేష్, రవీందర్ ఉన్నారు.
వట్టికోట ఆళ్వార్ స్వామి సాహితీ కళాపీఠం ఏర్పాటు
రామగిరి(నల్లగొండ): గ్రంథాలయ ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి సాహితీ కళాపీఠాన్ని మంగళవారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షుడిగా డా.బెల్లి యాదయ్య, గౌరవ సలహాదారులుగా పూజర్ల శంభయ్య, గింజల నరసింహారెడ్డి, అధ్యక్షుడిగా తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మామిడి లింగస్వామి, ఉపాధ్యక్షుడిగా కుంచె నగేష్, కోశాధికారిగా సారంగి వెంకన్న, సంయుక్త కార్యదర్శిగా ముక్కామల జానకిరామ్‌లను ఎన్నుకున్నారు. వారితోపాటు నలుగురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.