
ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని శిక్షించాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధును విచక్షణ రహితంగా కొట్టిన వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ అన్నారు. మంగవారం వారు తండాకు చేరుకుని బాధితుడు సాయిసిద్ధును పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీసులు సాయిసిద్ధును దారుణంగా కొట్టారని, దీంతో నడవలేని స్థితిలో ఉన్నాడని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో పోలీసులు చట్టానికి అతీతంగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. గిరిజన యువకుడు సాయిసిద్ధును హింసించిన వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు అతనికి సహకరించిన ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్‌ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తాళ్ల రోహిత్, దిలీప్‌కుమార్, వెంకటనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ, సభ్యులు గురవయ్య, వెంకటరమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మానవహక్కుల వేదిక బృందం