
మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు పోతున్న వరదనీరు
భీమారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద
కేతేపల్లి : నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు శనివారం వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మది క్రస్ట్‌గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్, జనగాం, ఆలేరు, వరంగల్ తదిరత ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, వసంతవాగు, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుయి. ఆయా వాగుల ద్వారా శనివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్‌లోకి 41,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో 643.70 అడుగుల వద్ద నీరు ఉంది. మూసీకి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్ గేట్లను ఎనిమిది అడుగులు, ఒక గేటును ఆరు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 44,547 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
భీమారం వద్ద నిలిచిన రాకపోకలు..
మూసీ ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తడంతో కేతేపల్లి మండలం భీమారం–సూర్యాపేట మధ్య భీమారం శివారులో మూసీవాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన వరదనీటిలో మునిగిపోయింది. వంతెన మీదుగా నాలుగు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో మిర్యాలగూడ నుండిచి వయా భీమారం మీదుగా సూర్యాపేటకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సూర్యాపేట – మిర్యాలగూడ పట్టణాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను అధికారులు వయా ఉప్పలపహాడ్, కొప్పోలు గ్రామాల మీదుగా దారి మళ్లించారు. వంతెనపైకి వాహనాలు వెళ్లకుండా కేతేపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు పికెట్ ఏర్పాటు చేశారు. వంతెనపై వరద ప్రవాహాన్ని తహసీల్దార్ రమాదేవి, ఎస్‌ఐ సతీష్ పరిశీలించారు.
ఫ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేత

మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద