
ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలి
నల్లగొండ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలపై శుక్రవారం ఉదయాదిత్య భవన్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో సొంత నిర్ణయాలను తీసుకోవద్దని, తప్పులు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘం జారీచేసిన హ్యాండ్‌బుక్‌ను, నియమ, నిబంధనలను పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. ఎన్నికల విధులకు నియమించే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, టీఏ, డీఏ చెల్లిస్తామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, డాక్టర్ రమేష్, మాస్టర్ ట్రైనర్ బాలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి