
నిల్వ చేసిన యూరియా పంపిణీ
మిర్యాలగూడ : మండలంలో యూరియా పక్కదారి పట్టించుందుకు చేసిన యత్నాన్ని రైతులు, అధికారులు భగ్నం చేశారు. మండలంలోని గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని బోట్యానాయక్‌తండాలోని ఓ ఫర్టిలైజర్ షాపునకు సంబంధించిన గోదాములో 222 బస్తాల యూరియాను గురువారం దిగుమతి చేసినట్లు సమాచారం. వాటిని వెంటనే రైతులకు పంపిణీ చేయాల్సి ఉన్నా.. గురువారం సాయంత్ర వరకు ఇవ్వకుండా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం అధికారులు అక్కడికి చేరుకుని యూరియాను రైతులకు పంపిణీ చేశారు. కాగా యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించిన డీలర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఇన్‌చార్జి ఏడీఏ సైదానాయక్ తెలిపారు.