
విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేసిన కేటీఆర్
రామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని విజయలక్ష్మికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ల్యాప్‌టాప్ అందజేశారు. విజయలక్ష్మి తండ్రి లింగయ్య ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో విద్యార్థిని చదువుకు అండగా ఉండేలా శుక్రవారం ల్యాప్‌టాప్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల అరవింద్‌రెడ్డి, నాయకులు హరీష్‌రెడ్డి, పొగాకు గట్టయ్య, బాకి నాగయ్య, మామిడి స్వామి పాల్గొన్నారు.
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘స్వస్తినారి స్వస్తిక్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సీ్త్రలలో అనారోగ్యలను తగ్గించేందుకు ప్రత్యేక నిపుణుల చేత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య పరీక్షలు చేసి అవసరమైనవారికి మందులు ఇవ్వడంతో పాటు శస్త్ర చికిత్సల ద్వారా నయం చేస్తామన్నారు. ఈ వైద్య శిబిరానికి 101 మంది మహిళలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యుగేందర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్లు వింద్యావల్లి, నర్మద, మాధురి, సిబ్బంది పాల్గొన్నారు.
అవసరం మేరకే యూరియా కొనాలి
రామగిరి(నల్లగొండ) : రైతులు ప్రస్తుతం పంటకు అవసరం ఉన్న మేరకు మాత్రమే యూరియా కొనుగోలు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్ సూచించారు. శుక్రవారం నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి రైతు వేదిక వద్ద యూరియా విక్రయాన్ని ఆయన పరిశీలించారు. యూరియా సరఫరా నిరంతరం జరుగుతుందని రాబోయే పంటలకు ఇప్పుడే కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. దాని వల్ల ప్రస్తుతం అవసరం ఉన్న రైతులు ఇబ్బందులు పడతారన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేసిన కేటీఆర్

విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేసిన కేటీఆర్