
రోజూ ఎదురుచూసుడే..
పెద్దవూర : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. పెద్దవూర మండల కేంద్రంలో ఒకేరోజు మూడుసార్లు రోడ్డెక్కారు. శ్రీరాంనాయక్ అనే రైతు తాను నాలుగైదు రోజులుగా యూరియా కోసం వస్తున్నా ఒక్క బస్తా దొరకలేదని మండల కేంద్రంలోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మిర్యాలగూడెం, సాగర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి శ్రీరాంనాయక్‌ను రోడ్డుపై నుంచి పంపించి వేశారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి చొరవ తీసుకుని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, కలెక్టర్‌తో మాట్లాడి మాధ్యాహ్నానికి రెండు లారీల్లో యూరి యా తెప్పించారు. అంతకుముందే ఓ లారీ యూరి యా ఉండడంతో శుక్రవారం ఒక్కరోజే 1320 బస్తాల యూరియాను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ మండలానికి రానంత యూరియా పెద్దవూరకు తెప్పించినట్లు తెలిపారు. మండలానికి ఇప్పటికే 1600 టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు.
ఫ యూరియా కోసం రైతుల ఆందోళన
ఫ పంట దిగుబడి తగ్గుతుందని ఆవేదన