
వినూత్నంగా పోషణ మాసం
నల్లగొండ : అంగన్‌వాడీల ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కిచెన్ గార్డెన్ల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. సొంత భవనాలు ఉన్న 625 అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీసం 425 కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ పెంచాలని ఆదేశించారు. ప్రహరి గోడలు లేని కేంద్రాలను బయో పెన్షింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు పోషణలో మగవారిని భాగస్వామ్యం, స్థానిక వంటకాలను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం పోషణ మాసం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్య క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి