
సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
నల్లగొండ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం నల్లగొండలోని పీఆర్‌టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ రద్దు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలె పెట్టిందన్నారు. దాన్ని అమలు చేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నారని.. తెలంగాణలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వెళ్లేలా సమాయత్తం చేస్తామన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి జాన్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సుంకరి బిక్షంగౌడ్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, గౌరవ అధ్యక్షుడు సత్తయ్య, శ్రీనివాసరెడ్డి, యూసుఫ్‌పాష, మారం వెంకటరెడ్డి, సునీల్, శంకరయ్య, సువర్ణ, సత్తిరెడ్డి, గోపాల్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్