
248 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు
నల్లగొండ : విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. జిల్లాలో ఎన్‌రోల్‌మెంట్ లేని పాఠశాలలు, విద్యార్థుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలనుంచి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతితో జిల్లాలో 248 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. స్కూల్ అసిస్టెంట్లను కాంప్లెక్స్ నుంచి నియోజకవర్గ పరిధిలో.. ఎస్‌జీటీను కాంప్లెక్స్ పరిధిలో అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేశాయని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో 69 మంది స్కూల్ అసిస్టెంట్లును, 179 మంది ఎస్‌జీటీలను సర్దుబాటు చేస్తూ డీఈఓ భిక్షపతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు ఆయా ఉపాధ్యాయులను పాఠశాలల నుంచి రిలీవ్ చేయడంతో పాటు సర్దుబాటు చేసిన పాఠశాలల్లో రిపోర్టు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైన ఉపాధ్యాయులు జాయిన్ కాకపోతే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.