
యూరియా దందాపై విచారణ చేపట్టాలి
చిట్యాల : మండలంలోని వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. చిట్యాలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటలకు యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా యూరియా బస్తాలను ప్రైవేట్ పరిశ్రమలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ దందాలో కీలక వ్యక్తులను తప్పించి సొసైటీ అటెండర్‌పై నేరాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు సహకరిస్తున్న ఆ సొసైటీ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల అయిలయ్య, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మాజీ ఎంపీపీ కొలను సునిత వెంకటేష్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన సత్తయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మాజీ సర్పంచ్ మర్రి జలంధర్‌రెడ్డి, సాగర్ల భిక్షం, బాతరాజు రవీందర్, శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.