
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థుల చనిపోతున్నా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, సైదానాయక్, కుంచం కావ్య, కోరె రమేష్, వెంకటేశ్, మారుపాక కిరణ్, ముస్కు రవీందర్, స్పందన, సిరి, జగదీష్, జగన్‌నాయక్, వీరన్న, రాకేష్, సాయి, నవదీప్, ప్రణయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.