
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
మర్రిగూడ : కేసుల దర్యాప్తు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ శరత్‌చంద్రపవార్ అన్నారు. బుధవారం మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిసరాలపై ఎస్‌ఐ ఎం.కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేసుల రికార్డులను పరిశీలించి రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్‌డెస్క్, స్టేషన్ రైటర్, లాక్‌అప్, ఎస్‌హెచ్‌ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం లేకుండా బాధితులకు న్యాయం చేయాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఐ కృష్ణారెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఎస్‌ఐ ఎం.కృష్ణారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్రపవార్