
విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేయాలి
నల్లగొండ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థలను రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల సరఫరాపై అధికారులకు పలు సూచనలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సక్రమ నీటి నిర్వహణ, రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి