
సోలార్ ప్యానెల్‌తో నేరుగా చార్జింగ్
కట్టంగూర్ : పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్వబాగ్ ల్యాబ్స్‌కు కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ డబ్బులతో స్వబాగ్ ల్యాబ్స్ వారు స్వచ్ఛ శక్తి కేంద్రం, మహిళా సంఘాలతో రెండు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకొని అర్హులైన 50 మంది మహిళల ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. మహిళలు వారంలో ఒకటి లేదా రెండుమార్లు సోలార్ ప్యానల్స్‌ను శుభ్రపరిచి ఆదాయం పొందుతున్నారు. నాలుగు నెలలుగా ప్రతి మహిళ బ్యాంక్ అకౌంట్‌లో ఒకటో తేదీన సంస్థ వారు రూ.2 వేలు జమ చేస్తున్నారు. మహిళలు సోలార్ ప్లేట్ల క్లీనింగ్, సిబ్బందికి సహకరిస్తే సరిపోతుంది.
ఇంటిపై ఏర్పాటుచేసిన రెండు సోలార్ ప్యానల్స్‌తో నేరుగా బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. ఒక్కో బ్యాటరీ చార్జ్ కావడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. బ్యాటరీ 100 శాతం చార్జ్ అవగానే ఆటోమెటిక్‌గా చార్జింగ్ ఆగిపోతుంది. స్వబాగ్ ల్యాబ్ వారు ఐఓటీ ద్వారా బ్యాటరీ చార్జింగ్‌ను తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్లి మరో బ్యాటరీ అమర్చి చార్జింగ్ అయిన బ్యాటరీని స్వచ్ఛశక్తి కేంద్రం వద్దకు తరలిస్తారు. ఒక్కో బ్యాటరీ రెండు యూనిట్లు విద్యుత్‌ను స్టోరేజీ చేసుకుంటుంది. స్వబాగ్ ల్యాబ్ వారు యూనిట్‌కు రూ.16.50 చొప్పున మహిళలకు చెల్లిస్తున్నారు.

సోలార్ ప్యానెల్‌తో నేరుగా చార్జింగ్