
బ్యాంకు రుణాలపై అవగాహన అవసరం
చిట్యాల : ప్రతిఒక్కరికి సైబర్ మోసాలు, బ్యాంకు రుణాలు, ఆర్థికాంశాలపై అవగాహన అవసరమని లీడ్ బ్యాంకు స్టేట్ ఆఫీసర్ గోమతి, జిల్లా మేనేజర్ శ్రామిక్ పేర్కొన్నారు. శుక్రవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో జన సురక్ష, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎస్‌బీఐ ద్వారా అందిస్తున్న సురక్ష, బీమా యోజన, జీవనజ్యోతి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు అధికారులు ప్రమోద్, లింగారెడ్డి, చిట్యాల ఎస్‌బీఐ మేనేజర్ జయరాజ్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అధికారులు డి.సైదులు, ఎం.స్వాతిక, సీఎస్‌పీ అధికారులు మల్లేష్, మాజీ సర్పంచ్ సుంకరి యాదగిరి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.