
సీఎం రేవంత్‌రెడ్డివి అబద్ధపు ప్రచారాలు
రామగిరి(నల్లగొండ) : సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తుంగతుర్తి సభలో రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ మీద రాజకీయ దురుద్దేశంతో మాట్లాడారన్నారు. కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం తగదదన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 6.47 లక్షల రేషన్‌కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. సభలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల మీద ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాల కోసం మోదీని కలుస్తారని.. కానీ బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు అడగడం లేదన్నారు. జగదీశ్‌రెడ్డి మీద వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను పారించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తక్షణమే సాగర్ ఎడమ కాల్వకు నీరిచ్చి నారుమళ్లను కాపాడాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నాయరకులు నిరంజన్ వలి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, కటికం సత్తయ్యగౌడ్, పంకజ్ యాదవ్, ప్రసన్నరాజ్ పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్