డబుల్ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేయాలి
నార్కట్‌పల్లి : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నార్కట్‌పల్లి మండలం బి.వెల్లంల గ్రామంలో ఏర్పాటు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసి ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద డ్రైయినేజీ, విద్యుత్, తాగునీరు, రోడ్ల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని మొత్తం మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆస్పత్రిని తనిఖీ చేసి అక్కడి వైద్య సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, రోగులకు బెంచీలు కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌కు సిబ్బంది వివరించడంతో తన నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ ఆర్డీఓ వై,అశోక్‌రెడ్డి,. తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, డాక్టర్ విజయ్‌కుమార్, పలువురు అధికారులు,.సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


