ఉగాది పురస్కారాలు అభినందనీయం
ఫ ఉగాది వేడుక
రామగిరి (నల్లగొండ) : దాశరథి శత జయంతి సందర్భంగా సాహితీ మేఖల సంస్థ ఉగాది కవి సమ్మేళనం – ఉగాది పురస్కారాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో సాహితీ మేఖల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పున్నమి అంజయ్య రచించిన నీలగిరి కవుల చరిత్ర–2వ భాగం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దాశరథి తొలి కావ్యం ‘అగ్నిధార’ను ప్రచురించిన ఘనత సాహితీ మేఖల సంస్ధదే కావడం నల్లగొండ జిల్లాకు గర్వకారణమన్నారు. సుందర దేశికులు రచించిన సత్యం శివం సుందరం పుస్తకాన్ని డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య ఆవిష్కరించారు. పున్నమి అంజయ్య రచించిన పున్నా శతకాన్ని సూలూరు శివ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో ప్రొఫెసర్ రుద్ర సాయిబాబ (శతాధిక పుస్తక రచయిత), సూలూరి శివ సుబ్రహ్మణ్యం (పద్య కవిత్వం), శిరంశెట్టి కాంతారావు (కథ/నవల), చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, కాసాల నర్సిరెడ్డి (సింగర్), ఎల్‌వి.కుమార్ (సేవా రంగం), నాగార్జున సత్యనారాయణ శర్మ (ఆధ్యాత్మిక సేవా రంగం) ఉన్నారు. రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు మేరెడి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కవి సమ్మేళనంలో కవులు మునాస వెంకట్, చొలేటి ప్రభాకర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మోత్కూరు శ్రీనివాస్, అద్దంకి లక్ష్మయ్య, కత్తుల శంకర్, బొల్ల ప్రవీణ్, జయాకర్, రాపోలు అరుణ జ్యోతి, విశ్వనాథుల యాదయ్య, రమేష్, మిట్టపల్లి పాండురంగయ్య, మంచుకొండ చిన భిక్షమయ్య, పెందోట సోము పాల్గొన్నారు. అనంతరం దేవులపల్లి నాగరాజు శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ఉగాది పురస్కారాలు అభినందనీయం
ఉగాది పురస్కారాలు అభినందనీయం
ఉగాది పురస్కారాలు అభినందనీయం


