ధాన్యంలో ఘనత
ఉద్దండుల గడ్డ..
ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా..
హుజూర్‌నగర్, హుజూర్‌నగర్‌రూరల్ :
● సాయంత్రం 5.56 గంటలకు హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద మోడల్‌కాలనీ ప్రదేశంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యింది.
● 5.57 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డికి సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
● 6.00 గంటలకు మోడల్ కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు.
● 6.16 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి.. మోడల్ కాలనీ నుంచి రాజీవ్ సభా ప్రాంగణానికి కాన్వాయ్‌లో మంత్రులతో కలిసి బయలుదేరారు.
● 6.22 గంటలకు సభా వేదికపైకి మంత్రులతో కలిసి సీఎం రావడంతో ప్రజలు హర్షధ్వానాలు, కేరింతలు కొట్టారు.
● 6.25 గంటలకు తెలంగాణ గీతాలాపన చేశారు.
● 6.32 గంటలకు సభా వేదికపైనే సీఎం, మంత్రులు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు.
● మంత్రి ఉత్తమ్ ప్రసంగం మధ్యలో కోదాడ, హుజూర్‌నగర్ పేర్లు చెప్పిన సమయంలో నాయకులు, కార్యకర్తల డ్యాన్స్‌లు, ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది.
● 6.55 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభమైంది.
● ప్రసంగం మధ్యలో సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి ఉత్తమ్ పేరు చెప్పడంతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో దద్దరిల్లింది.
● రాత్రి 7.28 గంటలకు సీఎం ప్రసంగం ముగిసింది.
● 33 నిమిషాల పాటు ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగింది.
● సీఎంను వేంకటేశ్వరస్వామి ఫొటో, జ్ఞాపిక, నాగలి, బంజారా టోపీలతో ఘనంగా సన్మానించారు.
● రాత్రి 7.40 గంటలకు సభ ముగిసింది.
సభావేదిక పైనుంచి అభివాదం
చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఫ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ
జిల్లాలో వరి అత్యధికం
ఫ సన్నబియ్యం పథకంతో హుజూర్‌నగర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది
ఫ పెండింగ్‌లో ఉన్న సాగునీటి
ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
ఫ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
ఫ హుజూర్‌నగర్‌లో అగ్రికల్చర్ కాలేజీ.. కోదాడలో నవోదయ పాఠశాల
ఫ మిర్యాలగూడ, దేవరకొండకు
‘యంగ్ ఇండియా’ స్కూళ్లు
ఫ ఉమ్మడి జిల్లాపై సీఎం వరాల జల్లు
హుజూర్‌నగర్, హుజూర్‌నగర్ రూరల్ : భూమి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు చేసిన వీరులగడ్డ నల్లగొండ జిల్లా. అన్ని రంగాలలో ఉద్దండులు ఉన్న ఈ జిల్లా.. సన్నరకం ధాన్యాన్ని పండించడంలోనూ ఘనత సాధించింది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైస్‌మిల్లులు ఎక్కువగా ఉన్నది నల్లగొండ జిల్లాలోనే అని ఆయన చెప్పారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రేషన్ కార్డుదారులకు 6 కిలోల ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చే సిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ కొనాలని నిర్ణయించిందని, సన్న వడ్లకు ప్రోత్సాహకంలో భాగంగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, బోనస్, రుణమాఫీ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాకే ఎక్కువగా వచ్చిందని చెప్పారు. సన్నబియ్యం పథకం ప్రారంభానికి వేదికై న హుజూర్‌నగర్.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని సీఎం అన్నారు.
టన్నెల్ పనులు కొనసాగిస్తాం..
ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో టన్నెల్ భవిష్యత్‌పై నీలి నీడలు కుమ్ముకోగా ఆ పనులను కొనసాగిస్తామని, టన్నెల్ పనులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో అగ్రికల్చర్ కాలేజీని మంజూరు చేస్తామని, కోదాడకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తానని సీఎం చెప్పారు. ఈ సందర్బంగా మిర్యాలగూడకు యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దేవరకొండకు యంగ్ ఇండియా స్కూల్ కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరగా.. వాటిని ఇస్తానని అయితే అక్కడికి వెళ్లినప్పుడు ప్రకటిస్తానని సీఎం పేర్కొన్నారు. అలాగే హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 2,160 సింగిల్ బెడ్రూం ఇండ్లకు రూ.60 కోట్లు మంజూరు చేశానని, అవి త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తామని సీఎం తెలిపారు. కృష్టపట్టె ప్రాంతం చైతన్యానికి మారుపేరని, కోదాడ హుజూర్‌నగర్ కాంగ్రెస్‌కు కంటచుకోటని కార్యకర్తలు నిరూపించారని ఆయన అన్నారు. రావి నారాయణరెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించింది నల్లగొండేనని, అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో రఘువీర్‌రెడ్డిని 5.60 లక్షల మెజార్టీతో గెలిపించారని, దక్షిణ భారత దేశంలోనే ఇది అత్యధిక మెజార్టీ అని అన్నారు. కోదాడ, హుజూర్‌నగర్ నుంచి లక్ష చొప్పన మెజార్టీ వస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబితే తాను నమ్మలేదని, అది నిరూపించారని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల రావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల సామేల్, వేముల వీరేశం, బాలు నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, మీర్ అలీఖాన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సెక్రటరీ డీఎస్ చౌహాన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు.
బహిరంగ సభ విజయవంతం
పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా ఆదివారం హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతమైంది. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో కాంగ్రెస్ నాయకుల్లో జోష్ నెలకొంది. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తుండటంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను జయప్రదం చేయడంలో సఫలీకృతులయ్యారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు, సభా ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, మూడురంగుల తోరణాలతో పట్టణం త్రివర్ణ మయంగా మారింది. సభకు వచ్చిన జనం కూడా కాంగ్రెస్ జెండాలు, కండువాలు వేసుకుని రావడంతో అంతా మూడురంగుల మయమైంది. రెండు నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం, గిరిజన తండాల నుంచి ప్రజలు అనుకున్నదానికంటే ఎక్కువగా హాజరయ్యారని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. సభ ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలు అలరించాయి.
మీఊరి కోడలు .. మాఊరి ఆడబిడ్డ
‘మీ ఊరి కోడలు.. మా ఊరి ఆడబిడ్డ’ అని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిని ఉద్దేశించి సభలో సీఎం రేంవత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తొలుత సభావేదికపైకి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే పద్మావతి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
మోడల్ కాలనీని సందర్శించిన సీఎం
హుజుర్‌నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం, మంత్రులకు సీఎస్ శాంతికుమారి, జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్‌పవార్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అక్కడ ఇళ్లను సీఎం.. మంత్రి ఉత్తమ్‌తో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల తీరును సీఎంకు రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ విరించారు. 135 బ్లాక్‌లు చేపట్టి 2,160 ఇళ్లను నిర్మించినట్లు సీఎంకు తెలిపారు. అత్యధికంగా ఒకే చోట అన్ని హంగులతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. పార్క్, కమ్యూనిటీ హాల్, మార్కెట్ వంటి సౌకర్యాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలోనే ఇంత భారీగా సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడం ఇదే మొదటిసారి అని, పట్టణానికి అతి సమీపంలో ఉండడం, ప్రజల అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన సీఎంకు తెలిపారు.
ధాన్యంలో ఘనత
ధాన్యంలో ఘనత
ధాన్యంలో ఘనత
ధాన్యంలో ఘనత


