నల్లగొండ : ఎన్నికల అధికారులు గత నెల 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం పరిమితికి మించి నగదు, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్లినా అందుకు సంబంధించి ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.33,89,75,263, బంగారు, వెండి ఆభరణాలతో పాటు లిక్కర్‌ను సీజ్ చేశారు. కాగా తగిన ఆధారాలు చూపించడంతో రూ.33,84,46,263, కొన్ని విలువైన వస్తువులు రిలీజ్ చేశారు. ఇంకా రూ.5,29,000 నగదుతో పాటు కొన్ని విలువైన వస్తువులు రిలీజ్ చేయాల్సి ఉంది.