అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

Mar 29 2023 2:38 AM | Updated on Mar 29 2023 2:38 AM

పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌  - Sakshi

పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌

నాగార్జునసాగర్‌ : నందికొండ మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతగా త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం నందికొండ మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కర్ణ అనూషారెడ్డి అధ్యక్షతన జరిగిన బడ్జెట్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5.75 లక్షలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాది ప్రారంభ నిల్వ రూ.12.07లక్షలు కాగా మొత్తం ఆదాయ నిల్వలు రూ.17.82 లక్షలుగా రూపొందించారు. అనంతరం రూ.25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్‌ సమీక్షించారు. వచ్చే వారంలో సంబంధిత పనుల ఇంజనీర్లతో కలిసి వస్తానని పనుల నాణ్యతతో పాటు జరుగుతున్న తీరును పరిశీస్తానని తెలిపారు. కాలనీల్లో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలకు ప్రాధాన్యతనిచ్చి పెంచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా, కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బిన్ని, కౌన్సిలర్లు రమేశ్‌, రామకృష్ణ, ఇందిర, మంగ్తానాయక్‌, నాగమణి, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement