భూములను అమ్మి మమ్మల్ని చదివించారు | - | Sakshi
Sakshi News home page

భూములను అమ్మి మమ్మల్ని చదివించారు

Jun 21 2026 6:58 AM | Updated on Jun 21 2026 6:58 AM

‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్‌ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం. మా నాన్నకు ముగ్గురం పిల్లలం. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తనకు ఉన్న పదెకరాల భూమిని అమ్మి మమ్మల్ని చదివించారు. కూతుళ్లను భారం అనుకోలేదు.. భవిష్యత్‌ అనుకున్నారు. నాతోపాటు వారిని సైతం వైద్యవిద్య చదివించారు. మేం సంపాదించింది ఆస్తి కాదు.. విద్య. నేడు మా కుటుంబంలో అందరూ వైద్యులుగా సమాజానికి సేవ చేయడం వెనుక మా తల్లిదండ్రుల త్యాగమే అసలు కారణం. జీవితంలో మొదటి క్రమశిక్షణ ఇంట్లోనే మొదలవుతుంది. నిజాయితీగా జీవించడం.. మాట నిలబెట్టుకోవడం.. ఇతరులను గౌరవించడం వంటి విలువలను మా నాన్న చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు. పోలీసు అధికారిగా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ విలువల ప్రభావం కనిపిస్తుంది. ఆయన నేర్పిన విలువలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్‌ అన్నారు.

తన తండ్రి గంగన్నతో

నారాయణపేట ఎస్పీ డా.వినీత్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement