అన్నీ తానై.. నడిపించాడు | - | Sakshi
Sakshi News home page

అన్నీ తానై.. నడిపించాడు

Jun 21 2026 6:58 AM | Updated on Jun 21 2026 6:58 AM

వెల్దండ: తమ పిల్లలకు నాన్నే సర్వస్వం. ఎన్నికష్టాలు ఎదురైనా.. అన్నీ తానై వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని పోచమగడ్డతండాకు చెందిన వడ్యావత్‌ ఉమాపతినాయక్‌ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు యశ్వంత్‌నాయక్‌ ఐఏఎస్‌ ఎంపికై ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించగా.. తన నమ్మకాన్ని నిలబెట్టిన కుమారులను చూస్తే గర్వకారణంగా ఉందని తండ్రి ఉమాపతినాయక్‌ ‘సాక్షి’తో చెప్పారు.

నమ్మకాన్ని నిలబెట్టుకున్నా: యశ్వంత్‌నాయక్‌, ఐఏఎస్‌

నాపై నాన్న ఎంతో నమ్మకంతో ఉన్నత చదువులు చదివించారు. నా ఆయ సాధనకు ఎంతో కృషి చేశారు. ఆయనే అన్నీ ముందుండి నడిపించారు. నా విజయానికి మూలం నాన్న. ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణ, విలువలతో కూడిన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం నన్నెంతో ప్రభావితం చేశాయి. నన్ను ఈస్థాయిలో నిలబెట్టిన నాన్నకు తండ్రుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తండ్రి చూపిన దారి, బిడ్డ సాధించిన విజయం, అదే కుటుంబ గౌరవం, సమాజానికి స్ఫూర్తిదాయకం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement