
డీడీగా సత్యనారాయణ
కల్వకుర్తి రూరల్: పాడి పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సత్యనారాయణయాదవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ధనరాజ్ బదిలీపై హెడ్ ఆఫీస్‌కు వెళ్లారు. సత్యనారాయణ డీడీ గతంలో ఐదేళ్ల పాటు విధులు నిర్వహించి జనగాం కు బదిలీపై వెళ్లారు. అక్కడ ఏడాది పాటు బాధ్యతలు నిర్వహించి తిరిగి నాగర్‌కర్నూల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పాడి రైతులు ఆయనను సన్మానించారు. పాల శీతలీకరణ కేంద్రం మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు సమస్య లేకుండా చూడడంతో పాటు వారికి మేలు చేసే చర్యలు చేపట్టాలని కోరారు.