విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

Jul 31 2025 7:36 AM | Updated on Jul 31 2025 8:59 AM

విధుల

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

ఉప్పునుంతల: వైద్యులు ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం చేసే వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌, ఓపీ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మెలగాలని సూచించారు. మందుల స్టాక్‌ వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు స్వప్న, శివలీల, నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉఫత్‌, నిర్మల, ఫార్మసిస్టు కుమారచారి ఉన్నారు.

పీఏసీఎస్‌ తనిఖీ

ఉప్పునుంతల: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్‌)ను బుధవారం నాబార్డు అధికారులు శ్రీనివాస్‌రావు, స్వప్నిల్‌ తనిఖీ చేశారు. 2025 మార్చి 31వ తేదీ వరకు గత ఆర్థిక సంవత్సరంలో కొనసాగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)కు సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. అదేవిధంగా వడ్డీ రిబేట్‌కు సంబంధించి రైతుల ఖాతాలో జమచేసిన అంశాలను పరిశీలించారు. పంట, దీర్ఘకాలిక, ఇతర రుణాలు, రికవరీకి సంబంధించిన రికార్డులను చూశారు. పీఏసీఎస్‌లోని రికార్డు గది, లాకర్‌ రూం, ఎరువుల నిల్వ గోదాంలను వారు పరిశీలించారు. సంబంధించిన వివరాలను పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్తు భూపాల్‌రావు, సీఈఓ రవీందర్‌రావుల ను అడిగి తెలుసుకున్నారు. నాబార్డు అధికారులు, డీసీసీబీ ఏజీఎంలు దయాకర్‌రెడ్డి, భూపా ల్‌రెడ్డి, మేనేజర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

‘వన్య ప్రాణులకుహాని తలపెట్టొద్దు’

మన్ననూర్‌: వన్యప్రాణుల బారిన పడి మృత్యువాత పడిన పశువుల యజమానులకు అటవీశాఖ తరుఫున ప్రతి ఏటా నష్ట పరిహారం చెల్లిస్తున్నామని మన్ననూర్‌ అటవీశాఖ అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) వీరేశం తెలిపారు. అమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యం పూర్తిగా వన్య ప్రాణులకు ఆవాసాలుగా గుర్తించినట్లు తెలిపారు. అయినప్పటికీ దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలోని అటవీ సమీప గ్రామాల్లో నివాసం ఉంటున్న రైతులు పాడి పశువులను మేత కోసం అడవిలోకి వెళ్తుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ పరిసర ప్రాంతంలో పెద్ద పులులు, చిరుతలు పశువుల మీద దాడి చేసి చంపేసి తింటాయి. ఈ క్రమంలో పశువుల యజమానులకు నష్ట పరిహారంగా 2020–21లో 30 మందికి, 2022–23లో 50 మందికి, 2023–24లో 77 మందికి 2024–25లో ఇప్పటి వరకు 43 మందికి నష్ట పరిహారంగా డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. పశువులను నష్టపోయిన వారికి పరిహారం అందజేస్తున్నామని, ఎట్టి పరిస్థితిలో వన్యప్రాణులకు హాని తలపెట్టకుండా ఉండాలని ఆయన రైతులకు, స్థానికులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాలమూరులోని ఇండోర్‌ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థా యి అండర్‌–11 విభాగం బాలబాలికల బ్యా డ్మింటన్‌ ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.శ్రీనివాస్‌ ఎంపికల్లో గెలుపొంది న వారికి బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.రవికుమార్‌ మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంంటారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌ గోపాల్‌, సీనియర్‌ క్రీడాకారుడు సయ్యద్‌ పాల్గొన్నారు. కాగా..బాలుర సింగిల్స్‌లో అర్విన్‌ భాస్కర్‌ (ప్రథమ), విహాన్‌ (ద్వితీయ), బాలికల్లో డి.శ్రీహాస (ప్రథమ), లాస్యశ్రీ (ద్వితీయ), బాలుర డబుల్స్‌లో ఎస్‌.విహాన్‌–విశ్వతేజ, బాలికల డబుల్స్‌లో ఆద్య–అనుశ్రీలను ఎంపిక చేశారు.

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు  
1
1/1

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement