
ఎమ్మార్పీకేఎరువులు విక్రయించాలి
నాగర్‌కర్నూల్: ఎరువులు ఎమ్మార్పీ ధరలకు మంచి అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన ఆస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 2,100 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, మార్క్‌ఫెడ్ వద్ద మరో 770 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు మొక్కజొన్నకు ఎకరాకు 5 బస్తాలకు మించి యూరియా వాడకూడదని కోరారు. డీలర్లు యూరియాకు వేరే ఎరువులు లింక్ చేసి అమ్మినా.. కృత్రిమ కొరత సష్టించాలని చూసినా కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిరోజూ పీఏసీఎస్‌లను తనిఖీ చేయాలని, యూరియా నిల్వలు ఉన్న అన్ని దుకాణాలను ఎరువుల చట్టం పరిధిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీల్లో నాగర్‌కర్నూల్ ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, ఏఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు స్పాట్ అడ్మిషన్లు
మన్ననూర్: స్థానిక (మన్ననూర్) సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో మొద టి సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్ అ డ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రూపాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ ఎంపీసీ, బైపీసీలో మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు గురువా రం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు విద్యార్థులు హాజరు కావాలని కోరారు. అర్హత ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి మెమో, గ్రేడ్ (మెరిట్) పరిగణలోకి తీసుకొని ఎంపికై న విద్యార్థులకు అదే రోజు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు 2025 విద్యా సంవత్సరంలో ఒకటే ప్రయత్నంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని తెలిపారు.