
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి
కందనూలు: రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో జరుగుతున్న విద్యార్థుల మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ గురుకుల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ శనివారం రాత్రి మహాత్మాజ్యోతిరావూ పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కారణంగా 110 విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు గాని, ప్రభుత్వం గాని ఎలాంటి విచారణ చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో 94 మంది విద్యార్థులు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనకు తరలించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, పాలమూరు విభాగ్ కన్వీనర్ నరేష్ తేజ, రాష్ట్ర కార్యసమితి సభ్యులు సౌమ్య, అర్జున్, శివశంకర్, బంగారుబాబు, శంతన్, ప్రశాంత్, కల్వకుర్తి నగర కార్యదర్శి వంశీ, అనిల్, సాయి, భరత్, మల్లేష్ యాదవ్, ప్రసాద్ కుమార్, భాను, కీర్తన, కృష్ణవేణి, గాయత్రి, పల్లవి పాల్గొన్నారు.