
భయంతో ఇంటిదారి..
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్‌తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కొంతమంది తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. చాలామంది విద్యార్థులు భయాందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది.