
వసతులపై ప్రత్యేక శ్రద్ధ
కందనూలు: విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపా ధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం గురుకు ల పాఠశాలను సందర్శించిన ఆయన అస్వస్థతతకు గురైన విద్యార్థుల వివరాలను తెలుసుకొని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. విద్యార్థులకు ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. విద్యార్థులకు మెరు గైన వసతులు, నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ అమరేందర్, బీసీ గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, జిల్లా ఇన్‌చార్జ్ ప్రశాంతి, తదితరులున్నారు.