
నేడు డయల్ యువర్ డీఎం
నాగర్‌కర్నూల్ క్రైం: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రయాణికులు, ప్రజలు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సెల్ నం.73824 46772కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
నాగర్‌కర్నూల్: మున్సిపాలిటీలోని దుకాణ యజమానులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్స్ కోసం రూ.1,93,125 చెల్లించిన ప్రగతి హాస్పిటల్ వారికి మున్సిపల్ సిబ్బంది ట్రైడ్ లైసెన్స్ ధ్రువపత్రం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని దుకాణ యజమానులు ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, వార్డు ఆఫీసర్ సాయిరాం, సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తపాలా బీమాపై
అవగాహన కల్పించాలి
వెల్దండ: తపాలా శాఖ ద్వారా అందిస్తున్న జీవిత, ప్రమాద బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి డివిజన తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శుక్రవారం ఆయన వెల్దండ పోస్టాఫీస్‌ను పరిశీలించి మాట్లాడారు. తపాలా బీమాతో ఖాతాదారుల కుటుంబాలకు ధీమా కల్పిస్తుందన్నారు. పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్న పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువగా లాభం వచ్చేవి కేవలం తపాలా శాఖలోనే ఉన్నాయన్నారు. పోస్టాఫీసుల్లో వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే పొదుపు, రికరింగ్ డిపాజిట్లు, ఆడపిల్లలకు సుకన్య యోజన పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. 8 ప్రైవేట్ కంపెనీలతో కలిసి తక్కువ ప్రీమియం చెల్లించి పెద్ద మొత్తంలో బీమా పొందే పథకాలను పోస్టాఫీసు ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీపీఎం వెంకటేశ్వర్లు, సిబ్బంది రతన్‌నాయక్, రాజేందర్‌రెడ్డి, పుష్పగిరి, శ్రీనునాయక్, సత్యం, పవన్ తదితరులు పాల్గొన్నారు.