
విద్యార్థులకు నాణ్యమెన విద్య అందించాలి
చారకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందిచాలని డీఈఓ రమేష్‌కూమార్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక జెడ్పీహెచ్‌ఎస్, సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, విద్యార్థుల రిజిష్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. విద్యా ప్రమాణాలపై తరగతి గదిలో పరీక్షించారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించి చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పారు. విద్యాభ్యాసంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. మెనూ ప్రకారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలే భవిష్యత్‌కు దిక్సూచిగా నిలబడాలని, అందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతోపాటు, మెరుగైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్ నర్సింహ, ఎంఈఓ ఝాన్సీరాణి, కాంప్లెక్స్ హెచ్‌ఎం భగవాన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.